Oxford University: రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే.. ఇదీ 'ఆక్స్​ ఫర్డ్'​ అధ్యయనంలో తేలిన విషయం!

What Happens If Two Vaccines Mixed for 2 doses

  • అలసట, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు
  • రెండ్రోజుల పాటు ఉన్నాయని గుర్తింపు
  • ఒకే వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే తీవ్రత కొంచెం ఎక్కువ
  • వ్యాక్సిన్ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని వెల్లడి

ఫస్ట్ డోస్ కొవిషీల్డ్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కొవాగ్జిన్ విషయంలోనూ అదే సూచన చేసింది. మొదట ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. మన దేశమే కాదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ ఇదే నిబంధనను పెట్టాయి. కానీ, ఇటీవల కొన్ని దేశాలలో మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ ఇచ్చి.. రెండో డోస్ వేరే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మరి, అదెంత వరకు సేఫ్? దాని వల్ల కలిగే లాభనష్టాలేంటి? దీనిపైనే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఏం తేలిందంటే.. 

మొత్తంగా రెండు డోసులకుగానూ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసినా పెద్దగా ఎలాంటి సమస్యలు రావని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక డోస్ ఆస్ట్రాజెనెకా, మరో డోస్ ఫైజర్ టీకాలు తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇలా టీకాలు తీసుకున్న 10 శాతం మందిలో తీవ్రమైన అలసట ఉన్నట్టు గుర్తించారు. దాంతో పాటు తలనొప్పి, జ్వరం వంటి సహజమైన లక్షణాలూ చాలా మందిలో కనిపించాయని తేల్చారు.

ఈ లక్షణాలు ఎక్కువ రోజులేం లేవని, ఒకట్రెండు రోజుల్లోనే అంతా సాధారణమైపోయిందని చెప్పారు. అయితే, ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే అలసట తీవ్రత కొంచెం ఎక్కువని తేల్చారు. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అలసట కేవలం 3 శాతం మందిలోనే ఉందన్నారు. ప్రస్తుతం అధ్యయనంలో పాల్గొన్నది 50 ఏళ్లకు పైబడినవారేనని, యువతలో అలసట ఇంకొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

వ్యాక్సిన్ కొరతకు మంచి ఉపాయం?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీకాల కొరత ఉన్న నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసులుగా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అల్పాదాయ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరత ఉన్నా టీకా కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకుపోవచ్చని సూచిస్తున్నారు.

Oxford University
Covishield
Astrazeneca
Pfizer
COVID19
  • Loading...

More Telugu News