Kadapa District: కడప పేలుళ్ల ఘటన.. వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి అరెస్ట్

ysrcp leader arrested in kadapa mining blast case

  • ఈ నెల 8న ముగ్గురాయి గనిలో పేలుడు
  • 10 మంది కూలీల దుర్మరణం
  • పర్యావరణ అనుమతులు లేకున్నా నిర్వహణ
  • పేలుడు పదార్థాల రవాణాలో తీసుకోని జాగ్రత్తలు

కడప జిల్లాలో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైసీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. 2013లో జీపీఏ తీసుకుని నాగేశ్వరరెడ్డి ఈ గనిని నిర్వహిస్తున్నారు.

దీనికి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ఇక్కడ పేలుళ్లు జరపకూడదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గని వాస్తవ లీజుదారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు రఘునాథరెడ్డికి లైసెన్స్ ఉందని, అయితే వాటి రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకనే ఆయననూ విచారిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News