Bill Gates: ఎప్​ స్టీన్​ తో బిల్ గేట్స్ సంబంధాలు.. 2019లోనే తెగిన గేట్స్​ దంపతుల బంధం!

Gates Marriage Irretrievably Broken Since 2019 Over Epstein Report

  • అత్యాచార ఆరోపణలతో జైల్లో చనిపోయిన ఎప్ స్టీన్
  • 2013 నుంచే ఆయనతో బిల్ గేట్స్ సంబంధాలు
  • వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
  • ఆ సంబంధం వల్లే కాపురంలో కలతలు
  • ఏడాదిన్నర క్రితమే విడాకులకు మిలిందా దరఖాస్తు

బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ మధ్య బంధం 2019లోనే తెగిపోయిందట. ఆ నాటి నుంచే మిలిందా విడాకుల కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారట. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ సంబంధాలే.. గేట్స్ దంపతుల పచ్చని కాపురంలో నిప్పులు పోశాయట. ఈ మేరకు వారిద్దరి విడాకుల వ్యవహారంపై వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ఈ విషయాలను ప్రస్తావించింది.

2019 అక్టోబర్ లోనే విడాకుల కోసం పలు న్యాయ సంస్థలతో మిలిందా చర్చలు జరిపారని ఆ కథనంలో పేర్కొంది. దానికి సంబంధించిన పత్రాలు, వారి విడాకులతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న వ్యక్తుల వాంగ్మూలాలను ప్రచురించింది. 2013 నుంచే ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ కు సంబంధాలున్నాయని, చాలా సార్లు న్యూయార్క్ టౌన్ హౌస్ లో ఎప్ స్టీన్ తో బిల్ సమావేశమయ్యారని వెల్లడించింది.

అయితే, ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ పెట్టుకున్న ఆ డీలింగ్స్ వల్లే మిలిందా ఆయనకు దూరంగా ఉంటున్నారని పేర్కొంది. అదే వారిద్దరి మధ్య ఎడతెగని దూరాన్ని పెంచిందని తెలిపింది. ఈ క్రమంలోనే సంపదలో భాగం చేయాలని పేర్కొంటూ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వెల్లడించింది.

గత వారం విడిపోతున్నట్టు అధికారికంగా వారిద్దరూ ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవితంలో విడిపోయినా.. వ్యాపారంలో మాత్రం కలిసే కొనసాగుతామని ప్రకటించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ను కలిసే నిర్వహిస్తామని వెల్లడించారు. మూడో ట్రస్టీగా కుబేరుడు వారెన్ బఫెట్ ఉంటారని చెప్పారు.

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొన్ని రోజులకే మిలిందా గేట్స్ కు 200 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను నాలుగు వేర్వేరు కంపెనీల్లోకి బిల్ గేట్స్ బదిలీ చేశారు. అందులో ఎక్కువగా కెనడియన్ నేషనల్ రైల్వే కంపెనీకి చెందిన 1.41 కోట్ల షేర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News