Cow urine: గో మూత్రం తాగండి.. కరోనాను తరిమికొట్టండి: యూపీ బీజేపీ ఎమ్మెల్యే ప్రచారం

bjp mla surendra singh recommended to stop corona

  • నేను రోజూ గోమూత్రం తాగుతాను
  • అందుకే కరోనా నన్నేమీ చేయలేకపోయింది
  • 50 మి.లీ. గోమూత్రాన్ని చల్లటి నీటిలో కలిపి తాగితే కరోనా మటాష్

‘‘కరోనా మహమ్మారి నన్నెందుకు తాకలేకపోయిందో తెలుసా?.. నేను ప్రతి రోజూ పరగడుపునే గోమూత్రం తాగుతాను. కాబట్టే కరోనా నన్నేమీ చేయలేకపోయింది’’.. ఈ మాటన్నది ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బైరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్. అందరూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోమూత్రాన్ని తాగి కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలంటూ తాను గోమూత్రం తాగుతున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.

రోజూ ఉదయం 50 మిల్లీలీటర్ల గోమూత్రాన్ని చల్లటి నీటిలో కలుపుకుని తీసుకుంటే సహజ సిద్ధమైన రోగ నిరోధకశక్తి వస్తుందని సింగ్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు అంగీకరించినా, లేకపోయినా ఇది నిజమని, కరోనాకు గోమూత్రమే రక్ష అని తేల్చిచెప్పారు. రోజుకు 18 గంటలు ప్రజల్లో ఉండే తాను ఇప్పటి వరకు కరోనా బారినపడకపోవడానికి ఈ చిట్కానే కారణమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాబట్టి అందరూ గోమూత్రం తాగి ఎలాంటి దిగులూ లేకుండా ఉండాలని ఆయన ప్రచారం చేస్తున్నారు.

Cow urine
Uttar Pradesh
Corona Virus
  • Error fetching data: Network response was not ok

More Telugu News