Oxygen Plants: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.309 కోట్లు కేటాయించిన ఏపీ సర్కారు

AP Govt huge allocations to establish oxygen plants in state

  • ఏపీలో కొవిడ్ ఉద్ధృతి
  • కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్
  • రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు
  • 10 వేల అదనపు పైప్ లైన్ల ఏర్పాటు
  • ఆక్సిజన్ సరఫరా ఇన్చార్జిగా కరికాల వలవన్ నియామకం

ఏపీ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అందుకోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేయనున్నారు.

ఈ క్రమంలో 50  క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయనున్నారు. అంతేగాకుండా, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. అటు, ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కు అప్పగించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా తీరుతెన్నులను ఆయన పర్యవేక్షిస్తారు.

  • Loading...

More Telugu News