Etela Rajender: మాజీ మంత్రి ఈటలను కలిసిన టీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత.. తెలంగాణ రాజకీయాల్లో చర్చ

TRS senior woman leader who met former minister Etela Rajender

  • గతంలో జడ్పీ చైర్ పర్సన్‌గా పనిచేసిన వైనం
  • గత రాత్రి ఈటల నివాసంలో భేటీ
  • పార్టీపై అసంతృప్తితోనేనని సమాచారం

తెలంగాణ మంత్రివర్గం నుంచి ఇటీవల బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ను గతంలో జడ్పీ చైర్ పర్సన్‌గా పనిచేసిన టీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు ఒకరు కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత రాత్రి రాజేందర్ నివాసంలోనే ఆమె భేటీ అయినట్టు తెలుస్తోంది. నిజానికి ఆమె గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీ మారతారన్న ప్రచారం జరిగినప్పటికీ పార్టీని వీడలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని ఆశించినా నిరాశే ఎదురైంది.

దీంతో పార్టీ నియమిత పదవుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆమె ఈటలను కలిసినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News