Nara Lokesh: 'హింసించే పులకేశి' అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్

Nara Lokesh calls CM Jagan Pulakesi

  • నువ్వు అధికారంలోకి వచ్చింది ఎందుకంటూ ఆగ్రహం
  • విపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకా అంటూ మండిపాటు
  • ఎవరూ నీ కేసులకు భయపడరని స్పష్టీకరణ
  • అధికారం అండతో విపక్షాన్ని బెదిరిస్తున్నారని విమర్శలు

నువ్వు అధికారంలోకి వచ్చింది ప్రజల్ని రక్షించడానికా? ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "అధికారం ఉంది కదా అని అక్రమకేసులతో ప్రతిపక్షాన్ని బెదిరించి, భయపెట్టాలనుకుంటున్నావు... టీడీపీ అధ్యక్షుడి నుంచి అభిమాని వరకు, కార్యదర్శి నుంచి కార్యకర్త వరకు ఎవరూ నీ కేసులకు భయపడరు" అని స్పష్టం చేశారు.

"హింసించే పులకేశి రెడ్డీ... నాపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో... నేను సిద్ధమే. టీడీపీ కార్యకర్త మారుతిపై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ వారిని ప్రశ్నించిన నాపై వైసీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి దాడులకు పాల్పడుతున్న వైసీపీ వారిపై కేసులు ఎందుకు నమోదు చేయరు?" అని ప్రశ్నించారు.

Nara Lokesh
Jagan
Pulakesi
Police Case
  • Loading...

More Telugu News