Sonakshi Sinha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Sonakshi Sinha opposite Nagarjuna

  • నాగార్జున సరసన బాలీవుడ్ భామ 
  • మహేశ్ షూటింగ్ ఇక అప్పుడే!
  • ఓటీటీ ప్రారంభించిన ప్రముఖ నటి

*  అక్కినేని నాగార్జున సరసన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కథానాయికగా నటించే అవకాశం కనిపిస్తోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం కోసం సోనాక్షితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారట. జులై నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ జులై నుంచి మొదలవుతుంది. అప్పటికి కొవిడ్ ప్రభావం తగ్గుతుంది కాబట్టి, జులైలో షూటింగ్ మొదలుపెడదామని మహేశ్ దర్శక నిర్మాతలకు చెప్పాడట. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించిన కథానాయిక నమిత తాజాగా వ్యాపారంలోకి కూడా దిగింది. సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. దీని పేరు 'నమిత థియేటర్'. దీని ద్వారా ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన కంటెంట్ ను  అందిస్తామని నమిత పేర్కొంది.

Sonakshi Sinha
Nagarjuna
Mahesh Babu
Namitha
  • Loading...

More Telugu News