Dhulipala Narendra Kumar: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు

Dhulipalla Narendra Tested Covid Positive
  • సంగం డెయిరీలో అవకతవకల ఆరోపణలు
  • ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్
  • కోర్టు ఆదేశాలతో పరీక్షలు
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ధూళిపాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జైలులో ఉన్న నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. స్వీకరించిన న్యాయస్థానం నరేంద్రకు ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆయనకు పరీక్షలు చేయించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Dhulipala Narendra Kumar
TDP
Corona Virus
Rajahmundry

More Telugu News