Madhavan: సోనూ సూద్ పై ప్రశంసలు కురిపించిన మాధవన్

Madhavan praises Sonu Sood

  • కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోను
  • సోనూకు దేవుడి దయ ఉండాలన్న మాధవన్
  • ప్రతి ఒక్కరికీ అండగా ఉండేందుకు యత్నిస్తున్నాడని కితాబు

కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తూ సినీ నటుడు సోనుసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు ఆయన ప్రస్తుతం తన వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ చేసిన సాయం వల్ల బెంగళూరులో 22 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని మరో ప్రముఖ నటుడు మాధవన్ పేర్కొంటూ, సోనూకు దేవుడి దయ ఉండాలని అన్నారు. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని ప్రశంసించారు. సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచేందుకు యత్నిస్తున్నారని కితాబునిచ్చారు. ఈ మేరకు మాధవన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Madhavan
Sonu Sood
Tollywood
Bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News