Pooja Hegde: సల్మాన్ తో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి: పూజ హెగ్డే

Pooja Hegde comments on Salman Khan

  • కరోనా వల్ల మేమిద్దరం నటించిన సినిమా విడుదల కాలేదు
  • సెట్స్ లో సల్మాన్ తో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను
  • ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్న పూజ

టాలీవుడ్ లో కన్నడ ముద్దుగుమ్మ పూజ హెగ్డే అగ్రనటిగా కొనసాగుతోంది. ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. కరోనా ప్రభావం లేకపోతే... ఈ ఏడాది ఈద్ కు సల్మాన్ తో తాను కలిసి నటించిన 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమా రిలీజ్ అయ్యేదని పేర్కొంది.

సెట్స్ లో ఉన్నప్పుడు సల్మాన్ తో తాను ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నానని,  ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పూజ తెలిపింది. ఆయనతో నటించడం చాలా గొప్ప అనుభవం అని చెప్పింది. సల్మాన్ తో తాను నటించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని తెలిపింది.

ఇటీవల పూజ హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోంది. మరోవైపు, పూజ బాలీవుడ్ లో మరో చిత్రాన్ని కూడా చేస్తోంది. రణవీర్ సింగ్ సరసన 'సర్కస్' చిత్రంలో ఆమె నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.

Pooja Hegde
Tollywood
Bollywood
Salman Khan
  • Loading...

More Telugu News