TS High Court: తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి
- తీవ్రత పెరుగుతుంటే పరీక్షలను ఎందుకు తగ్గించారని ప్రశ్న
- ఆసుపత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయన్న ప్రభుత్వం
- రాష్ట్రానికి ఆక్సిజన్ తరలించకుండా తమిళనాడు అడ్డుకుంటోందని వ్యాఖ్య
తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈ రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవైపు తెలంగాణలో కరోనా తీవ్రత పెరుగుతుంటే కరోనా పరీక్షలను ఎందుకు తగ్గించారని ప్రశ్నించింది.
ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రానికి ఆక్సిజన్ తరలించకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలిపారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పెంచడం వంటి అంశాలపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.