Pinarayi Vijayan: సీఎం పదవికి రాజీనామా చేసిన పినరయి విజయన్

Pinarayi Vijayan resigns

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయన్
  • కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా రాజీనామా
  • ప్రభుత్వం ఏర్పడేంత వరకు సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్

బంగారం కుంభకోణంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ... కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఎల్డీఎఫ్ కూటమికి సారథ్యం వహించిన ఆయన నాయకత్వానికి కేరళ ప్రజలు జేజేలు కొట్టారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో విజయన్.. సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కలిసి, తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు సీఎంగా కొనసాగాలని విజయన్ ను గవర్నర్ కోరారు.

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. గత నాలుగు దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో ఓకే వ్యక్తికి వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితి లేదు. ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టిన కేరళ ప్రజలు... విజయన్ కు వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు.

Pinarayi Vijayan
LDF
Kerala
Resign
  • Loading...

More Telugu News