Vijay Sai Reddy: ఓటమి ఖాయమని తెలిసీ తిరుపతిలో నాటకాలాడాడు బాబు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams tdp

  • రాళ్ల దాడి అన్నాడు
  • దొంగ ఓట్లని గగ్గోలు పెట్టాడు
  • ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ఉప ఎన్నిక ముందు చంద్ర‌బాబు ఎన్నో డ్రామాలు ఆడార‌ని ఆయ‌న అన్నారు.

'ఓటమి ఖాయమని తెలిసీ తిరుపతిలో నాటకాలాడాడు బాబు. రాళ్ల దాడి అన్నాడు. దొంగ ఓట్లని గగ్గోలు పెట్టాడు. కేసు వేయించాడు. ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. జయాపజయాలను నిర్ణయించేది ప్రజలు. ఓటమిని హుందాగా స్వీకరించే గొప్ప మనసు ప్రదర్శించలేక పోయాడు' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.



Vijay Sai Reddy
YSRCP
Tirupati
  • Loading...

More Telugu News