ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో ఎవరు.. వెనుకబడింది ఎవరు?
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- మమతా బెనర్జీ వెనకంజ
- కమలహాసన్, మెట్రో శ్రీధరన్, కేరళ, తమిళనాడు సీఎంల ముందంజ
- క్రికెటర్ మనోజ్ తివారీ వెనుకంజ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అధిక్యంలో కొనసాగుతుండగా, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శివపూర్ నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన క్రికెటర్ మనోజ్ తివారీ వెనుకంజలో ఉన్నారు. ఇక, దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ తన సమీప బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు.