Kodandaram: అందుకే సీఎం కేసీఆర్ ఇలా రెచ్చిపోతున్నారు: ఈట‌ల వ్య‌వ‌హారంపై కోదండ‌రాం కీల‌క వ్యాఖ్య‌లు

kodandaram slams kcr

  • ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకోవ‌డానికే  భూవివాదాలు తెర‌మీద‌కు
  • మ‌రి హ‌ఫీజ్‌పేట్, మియాపూర్ భూముల‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాలి
  • కేటీఆర్‌, మ‌ల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డిపై కూడా ద‌ర్యాప్తు ప్రారంభించాలి
  • కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి సిద్ధం

ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగ‌దీసుకోవ‌డానికే తెలంగాణ‌లో భూవివాదాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అన్నారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోప‌ణ‌ల‌పై దర్యాప్తు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.  తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ భూముల‌ను కాజేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో దానిపై కోదండ‌రాం మీడియాతో మాట్లాడుతూ... హ‌ఫీజ్‌పేట్, మియాపూర్ భూముల‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ‌లో క‌రోనా ఉద్ధృతి పెరిగిపోతోన్న నేప‌థ్యంలో దాని నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించడానికే ఈట‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని ఆయ‌న ఆరోపించారు. అలాగే, టీఆర్ఎస్‌పై మంత్రి ఈట‌ల గ‌ట్టిగా మాట్లాడినందుకే విచార‌ణ‌కు ఆదేశించార‌ని చెప్పారు. ఈ కార‌ణాల వ‌ల్లే సీఎం కేసీఆర్ ఇలా రెచ్చిపోతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. భూరికార్డుల ప్ర‌క్షాళ‌న‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు.

ఈట‌ల‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, మ‌ల్లారెడ్డి , టీఆర్ఎస్ నేత‌లు ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మ‌హిపాల్ రెడ్డిపై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారంద‌రితో క‌లిసి ఉద్య‌మాన్ని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు.

  • Loading...

More Telugu News