Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ పై తప్ప అన్ని జట్లపై నువ్వు పరుగుల వర్షం కురిపించాలి భయ్యా: రోహిత్ శర్మకు పంత్ బర్త్ డే విషెస్

Pant convey birthday wishes to Rohit Sharma

  • నేడు రోహిత్ శర్మ పుట్టినరోజు
  • హిట్ మ్యాన్ పై శుభాకాంక్షల జడివాన
  • అన్న గారూ హ్యాపీ బర్త్ డే అంటూ స్పందించిన పంత్
  • ఏడాది అంతా పరుగుల వాన కురిపించాలని వ్యాఖ్యలు

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. క్రికెట్ లోకం యావత్తు ఈ టీమిండియా వైస్ కెప్టెన్ కు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన టీమిండియా సీనియర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు.

"అన్న గారూ, హ్యాపీ బర్త్ డే" అంటూ ట్వీట్ చేశాడు. "ఈ ఏడాది నువ్వు పరుగుల వర్షం కురిపిస్తావని ఆశిస్తున్నా... ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ పై తప్ప!" అంటూ ఛలోక్తి విసిరాడు. కాగా, నిన్న రాజస్థాన్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం ముంబయి జట్టు డ్రెస్సింగ్ రూంలో రోహిత్ శర్మ బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

Rishabh Pant
Rohit Sharma
Birthday
Delhi Capitals
  • Loading...

More Telugu News