Cloth Mask: సర్జికల్ మాస్కులే అవసరం లేదు.. మూడుపొరలున్న క్లాత్ మాస్కూ సరిపోతుంది: శాస్త్రవేత్తలు

Three layer Cloth Mask safe to wear

  • మూడు పొరలున్న క్లాత్ మాస్కుతో 70 శాతం వరకు రక్షణ
  • వైరస్ తుంపర్లు గాలి వెళ్లే మార్గం గుండా వెళ్లలేవు
  • మాస్కులోని పోగులను ఢీకొట్టి ఆగిపోతాయి

కరోనా నుంచి కాపాడుకోవడానికి సర్జికల్ మాస్కే ధరించాలని ఏమీ లేదని, మూడు పొరలు ఉన్న క్లాత్ మాస్క్ అయినా సరిపోతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు పొరలతో కూడిన క్లాత్ మాస్కు కూడా సర్జికల్ మాస్క్ స్థాయిలోనే పనిచేస్తుందని బ్రిస్టల్, సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.

మూడు పొరలతో ఉన్న మాస్క్ ధరించిన వారు శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి వెళ్లే గాలి మెలి తిరుగుతుందని, ఫలితంగా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు గాలి వెళ్లే మార్గం ద్వారా వెళ్లలేవని తేలింది. మాస్కులోని పోగులను ఢీకొట్టి అవి అక్కడే ఆగిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సరిగా ధరించే మూడు పొరల మాస్క్ వల్ల 50 నుంచి 70 శాతం వరకు రక్షణ లభిస్తుందని వివరించారు.

Cloth Mask
COVID19
Surgical Mask
  • Loading...

More Telugu News