Perni Nani: కొవిడ్ ఎక్కువగా ఉంటే హైదరాబాదు వెళ్లిపోతాడు... తక్కువగా ఉంటే ఏపీలో తిరుగుతాడు: చంద్రబాబుపై పేర్ని నాని వ్యాఖ్యలు

Perni Nani slams Chandrababu amid covid situtations
  • చంద్రబాబుపై పేర్ని నాని ధ్వజం
  • ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం
  • మంచి సలహా ఇవ్వాలన్న ఆలోచనే లేదని వ్యాఖ్యలు
  • ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటన
ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా ఎక్కువగా ఉంటే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోతాడని, తక్కువగా ఉంటే ఏపీలో తిరుగుతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజం కోసం మంచి సలహా ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని పేర్ని నాని విమర్శించారు.

కొవిడ్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని ఉద్ఘాటించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అవసరానికి తగినట్టుగా ఆక్సిజన్, రెమ్ డెసివిర్ అందుబాటులో ఉంచామని చెప్పారు.
Perni Nani
Chandrababu
COVID19
Hyderabad
Andhra Pradesh

More Telugu News