Anil Ravipudi: నేను కరోనా నుంచి కోలుకున్నా: అనిల్ రావిపూడి

Anil Ravipudi said he tested negative for corona
  • ఈ నెల 13న అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్
  • తాజా పరీక్షల్లో కరోనా నెగెటివ్
  • అందరికీ కృత్ఞతలు తెలిపిన అనిల్
  • ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా నుంచి కోలుకున్నారు. తనకు తాజా వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని అనిల్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు ఈ నెల 13న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసినవాళ్లు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వారందరికీ వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. అప్పటినుంచి తాను ఐసోలేషన్ లోనే ఉన్నానని, వైద్య నిపుణుల సలహాలను పాటించానని తెలిపారు.

ఇవాళ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అనిల్ వివరించారు. తాను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Anil Ravipudi
Negative
Corona Virus
Director
Tollywood

More Telugu News