Bihar: బీహార్‌లో రియల్ లైఫ్ ‘హమ్ దిల్‌ దే చుకే సనమ్’.. భార్యను లవర్‌కి ఇచ్చి పెళ్లి చేసిన భర్త!

Bihar Man Marries Wife Of 7 Years To Her Lover

  • ఏడేళ్ల క్రితం వివాహం
  • ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త బంధువుతో ప్రేమ
  • ఇరు కుటుంబాలు నచ్చజెప్పినా వినిపించుకోని భార్య
  • ప్రేమికుడికి ఇచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసిన భర్త

వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ భార్య మరొకరిని ప్రేమిస్తుందని తెలిసిన భర్త.. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది చదవగానే ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ నటించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా గుర్తొస్తోంది కదూ. ఇలాంటివి నిజం జీవితంలోనూ జరిగితే.. ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. బీహార్‌లో అచ్చంగా ఇదే జరిగింది.

ఖగారియా జిల్లాకు చెందిన సప్న భాగల్‌పూర్‌ జిల్లా సుల్తాన్ గంజ్‌కు చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉత్తమ్ బంధువు రాజ్‌కుమార్‌ను సప్న కలవక ముందు వరకు వీరి దాంపత్య జీవితం హాయిగానే సాగింది. రాజ్‌కుమార్‌ను చూడగానే సప్న ప్రేమలో పడిపోయింది. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతిని మర్చిపోయి మరీ అతడి ప్రేమలో మునిగి తేలింది. అతడిని విడిచి ఉండలేకపోయింది. విషయం తెలిసిన భర్త ఉత్తమ్ భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు.

విషయం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు చేరడంతో వారు జోక్యం చేసుకున్నారు. సప్నకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తాను రాజ్‌కుమార్‌తోనే ఉంటానంటూ ఆమె తేల్చి చెప్పింది. ఆమె నిర్ణయానికి భర్త కూడా అంగీకరించాడు. దీంతో ఆశ్చర్యపోవడం కుటుంబ సభ్యులవంతైంది. అనుకున్నదే తడవుగా సుల్తాన్‌గంజ్‌లోని దుర్గామాత ఆలయంలో రాజ్‌కుమార్‌తో తన భార్యకు వివాహం జరిపించాడు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించడం గమనార్హం.

Bihar
Marriage
Lover
Husband
Hum Dil De Chuke Sanam
  • Loading...

More Telugu News