America: అమెరికా సీడీసీ నయా మార్గదర్శకాలు.. ఒక్క డోసు వేసుకున్నా మాస్క్ ధరించక్కర్లేదు!

US CDC Release new Guidelines

  • అమెరికా ప్రజలకు ఊరట
  • టీకా తీసుకున్న వారికి ఇక మాస్కుతో పనిలేదు
  • గుంపులోకి వెళ్తే మాత్రం పెట్టుకోవడం మంచిదన్న సీడీసీ

కరోనా తొలినాళ్లలో అల్లాడిపోయిన అమెరికా ప్రజలకు చెప్పలేనంత ఊరట లభించింది. ఇకపై అమెరికా పౌరులు మాస్కులు ధరించకుండానే బయటకు రావొచ్చు. అయితే, వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లకు, ఒక డోసు తీసుకున్న వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇకపై వారు మాస్కు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చు. ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో కానీ కలిసి నడకకు, షికారుకు వెళ్లొచ్చు. అయితే, జనాల గుంపులోకి వెళ్లేటప్పుడు మాత్రం మాస్కు ధరించడమే మేలని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, ఒక్క డోసు కూడా వేసుకోని వారు మాత్రం బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది.

America
CDC
Face Mask
  • Loading...

More Telugu News