Gangster: అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు కరోనా.. ఎయిమ్స్‌లో చేరిక
- 2015లో బాలిలో అరెస్ట్
- జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో దోషిగా తేలిన రాజన్
- జీవిత ఖైదు విధించి కోర్టు
తీహార్ జైలులో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడాయనను ప్రత్యేక వార్డులో ఉంచి, పోలీసుల నిఘా మధ్య చికిత్స అందిస్తున్నారు. చోటా రాజన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజన్‌కు కరోనా సోకినట్టు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ధ్రువీకరించారు.
తీహార్ జైలులోనే ఉన్న బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ కూడా కరోనా బారినపడ్డారు. కాగా, రాజన్‌పై ముంబైలో దోపిడీ, హత్య వంటి అభియోగాలతో దాదాపు 70 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2015లో ఇండోనేషియాలోని బాలిలో చోటా రాజన్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉన్నాడు. జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో 2018లో రాజన్ దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.