Modi: బైడెన్‌, మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ!

Phone conversation between modi and Biden

  • ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై చర్చ
  • చర్చలు ఫలవంతం అని మోదీ ట్వీట్‌
  • అమెరికా సాయానికి మోదీ కృతజ్ఞతలు
  • భారత్‌కు సహకారం అందిస్తామని అంతకుముందే ప్రకటించిన బైడెన్‌

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. వీరివురు ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. చర్చలు ఫలవంతంగా సాగాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌కు అండగా ఉంటామంటూ ముందుకు వచ్చిన బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇరువురి మధ్య సంభాషణ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అంతకుముందు, కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు అన్ని రకాలుగా సహకరిస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమైన మందులతో  పాటు ఇతర వైద్య పరికరాలను భారత్‌కు పంపుతామని తెలిపారు. భారత్‌ తమకు గతంలో సాయం చేసిందని.. అదే రీతిన ఇప్పుడు భారత్‌కు సహకారం అందిస్తున్నామని తెలిపారు. అలాగే కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News