Varla Ramaiah: ఇప్పుడు మంత్రి బొత్సను తొల‌గిస్తారా? లేక ఆళ్ల నానినా?: వ‌ర్ల రామ‌య్య

varla slams jagan

  • రామతీర్థ ఆల‌య నిర్వహణ సరిగా లేదని అప్ప‌ట్లో అన్నారు
  • ఛైర్మ‌న్‌ అశోక గజపతి రాజును తొలగించారు
  • మరి ఈ రోజు ఆక్సిజన్ సరిగా అందక కొవిడ్ రోగులు మృతి
  • ఇప్పుడు మీరు ఎవరిని తొలగిస్తారు?

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుప‌త్రిలో ఆక్సిజన్‌ అందక గ‌త రాత్రి ఇద్దరు కరోనా రోగులు మృతి చెందారు. దీనిపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స్పందిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ముఖ్యమంత్రి గారూ! రామతీర్థ కోదండ రామాలయ నిర్వహణ సరిగా లేదని దేవాలయ ఛైర్మ‌న్‌ అశోక గజపతి రాజును తొలగించారు. మరి, ఈ రోజు ఆక్సిజన్ సరిగా అందక, విజయనగరం ప్రభుత్వ ఆసుప‌త్రిలో కరోనా రోగులు మరణించారు. ఇప్పుడు మీరు ఎవరిని తొలగిస్తారు? జిల్లా మంత్రి బొత్సనా లేక ఆరోగ్య మంత్రి ఆళ్ల నానినా?' అని వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు.

Varla Ramaiah
Telugudesam
YS Jagan
  • Loading...

More Telugu News