Oscars 2021: అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. సెలబ్రిటీలు మాత్రమే హాజరు!

Chloe Zhao wins Best Director award for Nomadland
  • కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలు మాత్రమే హాజరు
  • లాస్‌ఏంజెలెస్‌లో రెండు వేదికలు
  • ఉత్తమ దర్శకురాలిగా క్లోవీచావ్
కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ప్రారంభమైంది. లాస్ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్, యూనియన్ స్టేషన్‌లలో రెండు వేదికలపై వేడుక ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో  సెలబ్రిటీలను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ‘నో మ్యాడ్‌లాండ్’ చిత్రానికి గాను క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలుగా ఎంపికైంది.

అలాగే ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు. మిగతా విభాగాల్లోనూ మరికాసేపట్లో విజేతలను ప్రకటించనున్నారు. ‘సౌండ్ ఆఫ్ మెటల్’కు ఉత్తమ సంగీతం, ‘జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా’ ఫేమ్ డానియెల్ కలువోయా ఉత్తమ సహాయనటుడిగా ఎంపికయ్యారు.
Oscars 2021
Chloe Zhao
Academy Awards 2021
Los Angeles

More Telugu News