Rain: మరో నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు... పలు చోట్ల పిడుగులు పడే అవకాశం!

 Rain and thunderbolt alert for AP

  • ఏపీకి భారీ వర్షసూచన
  • రేపు రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం
  • విపత్తుల శాఖ వెల్లడి
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లో వర్షం

ఏపీ విపత్తుల శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. మరో నాలుగైదు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లో  ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోందని వెల్లడించింది.

Rain
Thunderbolt
Andhra Pradesh
Disaster Management Department
  • Loading...

More Telugu News