Vellampalli Srinivasa Rao: ప్రజల కోసం కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే రాజకీయం చేస్తారా?: ఏపీ మంత్రి వెల్లంపల్లి
![Vellampalli furious on critics](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-608431bfa6c76.jpg)
- విజయవాడలో కీప్ వెల్ పార్కు ప్రారంభించిన మంత్రి
- పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు
- ఫాంహౌస్ లో ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యలు
- తాము ప్రజలకు మంచి చేస్తున్నామని వెల్లడి
విపక్ష నేతలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విజయవాడలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాము కొవిడ్ కేర్ సెంటర్ నిర్మిస్తుంటే కొందరు పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలు చేపడుతుంటే రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు కోసం పేదల ఇళ్లు వాడుకుంటున్నారని హైదరాబాద్ ఫాంహౌస్ లో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకే ఆ సెంటర్ నిర్మిస్తున్నామని, ఈ విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మితమైన కీప్ వెల్ పార్కును ప్రారంభించిన సందర్భంగా మంత్రి వెల్లంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.