Adimulapu Suresh: విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు చదువు కూడా ముఖ్యమే: మంత్రి ఆదిమూలపు సురేశ్

Adimulapu Suresh counters Nara Lokesh demand

  • ఏపీలో కరోనా విజృంభణ
  • పరీక్షలు వాయిదా వేయాలంటున్న విపక్షాలు
  • కోర్టుకు వెళతామంటున్న లోకేశ్
  • రాజకీయాలు మానుకోవాలని ఆదిమూలపు హితవు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేస్తుండడం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బదులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువు కూడా ముఖ్యమేనని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు మొత్తం 11 ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో తాము వాటిని 7కి కుదించామని వెల్లడించారు.

 విపక్షాలు పరీక్షల అంశంలో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదో తరగతి పరీక్షలపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఏపీలో విద్యాప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో దేశం మొత్తానికి కనిపిస్తున్నా, టీడీపీ నేతలకు కనిపించకపోవడం శోచనీయం అని వ్యాఖ్యానించారు.

Adimulapu Suresh
Nara Lokesh
Exams
Postpone
Counter
YSRCP
TDP
Corona Pandemic
Andhra Pradesh
  • Loading...

More Telugu News