Mahesh Babu: హోం క్వారంటైన్‌లో మ‌హేశ్ బాబు?... సుర‌క్షితంగా ఉండాల‌ని అభిమానుల పోస్టులు

mahesh babu in home quarantine

  • ఇప్ప‌టికే పలువురు సినీ ప్ర‌ముఖుల‌కు క‌రోనా
  • మ‌హేశ్ వ్య‌క్తిగ‌త సిబ్బందిలో ఒక‌రికి కొవిడ్ నిర్ధార‌ణ‌
  • #StaySafeMaheshAnna అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్‌ పోస్టులు

ఇప్ప‌టికే పలువురు సినీ ప్ర‌ముఖుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సినీ హీరో మ‌హేశ్ బాబు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. మ‌హేశ్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒక‌రికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో ఆయ‌న‌ అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో #StaySafeMaheshAnna అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ఆయ‌నకు క‌రోనా సోక‌కూడ‌ద‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. కాగా, క‌రోనా మ‌ళ్లీ ఉగ్ర‌రూపం దాల్చిన వేళ టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌లువురికి క‌రోనా సోక‌డంతో ఆందోళ‌న నెల‌కొంది. కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా హోం క్వారంటైన్‌లో ఉంటూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు.

Mahesh Babu
Tollywood
Quarantine Centre
  • Loading...

More Telugu News