Mumbai Indians: ఆపసోపాలు పడిన ముంబయి ఇండియన్స్... పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యం

Mumbai Indians set easy target for Punjab Kings
  • చెన్నైలో ముంబయి ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్
  • రోహిత్ శర్మ 63 పరుగులు
  • సమష్టిగా సత్తా చాటిన పంజాబ్ బౌలర్లు
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు అమోఘంగా రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయానికి తగిన న్యాయం చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో అతి కష్టమ్మీద 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు నమోదు చేశాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీయగా, దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ హిట్టర్లున్న ముంబయి జట్టు ఈ తరహాలో బ్యాటింగ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. డికాక్ 3, ఇషాన్ కిషన్ 6, పొలార్డ్ 16, హార్దిక్ పాండ్య 1, కృనాల్ పాండ్య 3 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు ఎంతో పకడ్బందీగా బంతులు వేయడంతో భారీ షాట్లు కొట్టేందుకు ముంబయి బ్యాట్స్ మెన్ సాహసించలేకపోయారు.
Mumbai Indians
Punjab Kings
Chennai
IPL

More Telugu News