Gautham Reddy: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్

AP minister Gautham Reddy tests with Corona positive

  • ఏపీలో పంజా విసురుతున్న కరోనా
  • సామాన్యులతో పాటు, ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్న వైనం
  • టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్న గౌతమ్ రెడ్డి

ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 10,759 కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. సామాన్యులే కాకుండా, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని... టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని... తగు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గతం వారం రోజుల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News