Nithyananda: భారత్ నుంచి వచ్చే భక్తులకు కైలాస ద్వీపంలోకి అనుమతి లేదు: నిత్యానంద
- కైలాస ద్వీపంలో ఉంటున్న నిత్యానంద
- కరోనా నేపథ్యంలో భారత్ తో పాటు మరిన్ని దేశాల భక్తులపై నిషేధం
- తదుపరి ప్రకటన వరకు ఎవరూ రావద్దని విన్నపం
స్వయం ప్రకటిత దేవుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యానంద కైలాస ద్వీపం పేరుతో ఒక దీవిలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ద్వీపాన్ని ఆయన తన దేశంగా ప్రకటించుకున్నారు. తమ ద్వీపానికి రావాలంటూ భక్తులను ఆయన కోరిన సంగతి కూడా అందరికీ విదితమే.
అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యానంద కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే భక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించలేమని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియా నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అనుమతి లేదని చెప్పారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.