Corona Virus: గుంటూరు కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు సహా 12 మందికి సోకిన మహమ్మారి

Guntur Court judges lawyers infected Covid
  • కరోనాకు చికిత్స పొందుతూ అసిస్టెంట్ నాజిర్ మృతి
  • వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న న్యాయమూర్తులు, లాయర్లు
  • భయపెడుతున్న మహమ్మారి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వేలాదిమందికి సోకుతున్న ఈ వైరస్ తాజాగా గుంటూరు జిల్లా కోర్టులో 12 మందికి సంక్రమించింది. వీరిలో న్యాయమూర్తులు, లాయర్లు, న్యాయశాఖ సిబ్బంది కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కోర్టు అసిస్టెంట్ నాజిర్‌గా పనిచేస్తున్న రవి కరోనాకు చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. అలాగే, ఇద్దరు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోర్టులో ఒకేసారి ఇంతమంది వైరస్ బారినపడడంతో ఇతర సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.
Corona Virus
Guntur District
court
Judge
Lawyers

More Telugu News