COVID19: కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్ నిర్మాత చిట్టి నాగేశ్వరరావు

Tollywood Producer CN Rao died with Corona virus
  • కరోనాతో ఆసుపత్రిలో చేరిన సీఎన్ రావు
  • పరిస్థితి విషమించడంతో నిన్న మృతి
  • తెలుగు చిత్ర పరిశ్రమలో పలు పదవుల్లో పనిచేసిన సీఎన్ రావు
కొవిడ్ బారినపడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ నిర్మాత సీఎన్ రావు (చిట్టి నాగేశ్వరరావు) నిన్న మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన పంపిణీదారుగా, నిర్మాతగా చిరపరిచితులు. ‘మా సిరిమల్లె’, ‘అమ్మనాన్న లేకుంటే’, ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ వంటి చిత్రాలను తెలుగులో నిర్మించగా, తమిళంలో ‘ఊరగా’ అనే సినిమాను నిర్మించారు.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు సినిమా వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, నిర్మాతల సెక్టార్ సెక్రటరీగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు.
COVID19
Tollywood
Producer
CN Rao

More Telugu News