Tamil Nadu: టీవీ నటితో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమ వ్యవహారం.. ఆమెకు అప్పటికే పెళ్లయినట్టు తెలియడంతో గొడవ!

TV Actress Love Affair Three Arrested in Chennai

  • చెన్నైలో ఘటన
  • భర్తతో విడిపోయి విడాకులకు దరఖాస్తు చేసిన నటి
  • స్నేహితులతో కలిసి ఇంటికెళ్లి గొడవ చేసిన ప్రియుడు
  • ముగ్గురి అరెస్ట్

భర్తతో విడిపోయిన ఓ టీవీ నటి ఆ తర్వాత మరో యువకుడితో ప్రేమలో పడింది. ఆమెకు ముందే వివాహమైన విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్న అతడు ఆమెను  నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 మనలి బాలాజీ పాళయానికి చెందిన జెన్నిఫర్ (24) టీవీ నటి. శరవణ్ అనే వ్యక్తితో 2019లో ఆమెకు వివాహమైంది. అయితే, వీరి దాంపత్య జీవితం ఎంతోకాలం నిలవలేదు. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. విడాకుల కోసం కోర్టుకెక్కారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

ఇదిలా ఉండగా, టీవీ సీరియళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (25)తో జెన్నిఫర్‌కు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. అయితే, జెన్నిఫర్‌కు అప్పటికే వివాహమైన విషయం తెలిసిన నవీన్ కుమార్ ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అప్పటికీ శాంతించని నవీన్ కుమార్ ఆదివారం తన స్నేహితులతో కలిసి జెన్నిఫర్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌తోపాటు ఆయన స్నేహితులు పాండియన్ (24), కార్తికేయన్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu
Jennifer
TV Actress
Love
Divorce
  • Loading...

More Telugu News