OMG Nithya: ఫన్ బకెట్ భార్గవ వ్యవహారంలో తన పేరు, ఫొటోలు వాడడంపై 'ఓఎంజీ నిత్య' స్పందన

OMG Nithya responds media campaign in Fun Bucket Bhargava issue

  • మైనర్ బాలికపై అత్యాచారం అంటూ భార్గవపై ఆరోపణ
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • భార్గవతో నిత్య కలిసి ఉన్న ఫొటోలు మీడియాలో దర్శనం
  • స్పందించిన టిక్ టాక్ స్టార్ నిత్య
  • తనకెలాంటి సంబంధంలేదని వివరణ

పద్నాలుగేళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడన్న ఆరోపణలపై టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, ఫన్ బకెట్ భార్గవపై వార్తలు ప్రసారం చేసే క్రమంలో చానళ్లు, వెబ్ సైట్లు తన పేరును, ఫొటోలను వాడుతున్నాయని మరో టిక్ టాక్ స్టార్ 'ఓ మైగాడ్ నిత్య' వాపోయింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

భార్గవ చేతిలో మోసపోయిన అమ్మాయిని తానే అని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని పేర్కొంది. తన ఫొటోలను డిలీట్ చేయాలని కోరింది. భార్గవను కలిసి ఏడాది అయిందని, తాము హైదరాబాదుకు వచ్చేశామని నిత్య తెలిపింది. త్వరలోనే ఈ కేసులో నిజానిజాలు తెలుస్తాయని, తన ఫొటోలను కావాలని వాడుతున్నారని చెప్పలేనని, కానీ వాస్తవాలు తెలిసిన తర్వాతైనా తన ఫొటోలు తొలగించాలని విజ్ఞప్తి చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News