UGC NET: కరోనా ఎఫెక్ట్ తో యూజీసీ నెట్ వాయిదా

UGC NET postponed due to corona pandemic

  • దేశంలో కరోనా విలయం
  • అనేక జాతీయస్థాయి పరీక్షలు వాయిదా
  • యూజీసీ నెట్ ను వాయిదా వేసిన ఎన్టీయే
  • మే 2 నుంచి 17 వరకు జరగాల్సిన పరీక్షలు
  • కరోనా వ్యాప్తితో రద్దు చేశామన్న ఎన్టీయే

లక్షల్లో కరోనా రోజువారీ కేసులు, నిత్యం వేయికి పైగా మరణాలతో దేశంలో బీభత్సకర వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక జాతీయస్థాయి పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా, యూజీసీ నెట్ ను కూడా వాయిదా వేశారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మే 2 నుంచి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగాల్సి ఉంది. అయితే, ఎక్కడికక్కడ కరోనా విజృంభిస్తుండడంతో యూజీసీ నెట్ వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది.

పరీక్షార్థుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, ప్రకటన వెలువడిన తర్వాత పరీక్షలకు కనీసం 15 రోజుల వ్యవధి ఉండేలా చూస్తామని వివరించింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ugcnet.nta.nic.in వెబ్ సైట్ ను సందర్శిస్తుండాలని ఎన్టీయే సూచించింది. ఇతర అంశాల్లో ఏవైనా సందేహాలు వస్తే 011-40759000 నెంబరుకు కాల్ చేయాలని, లేకపోతే ugcnet@nta.ac.in ఈమెయిల్ ఐడీని సంప్రదించాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News