Mayur Shelke: రైలు పట్టాలపై పడిన చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు నగదు బహుమతి

Railway employee who saves a child got reward for his courageous gesture

  • ముంబయిలో రైలు పట్టాలపై పడిపోయిన చిన్నారి 
  • ప్రాణాలకు తెగించి పట్టాలపైకి దూకిన మయూర్ షెల్కే
  • పాపను కాపాడిన వైనం.. వైరల్ అయిన వీడియో
  • షెల్కేను అభినందించిన అధికారులు

ముంబయిలోని ఓ రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. కొన్నిసెకన్లలో రైలు వచ్చేస్తుందనగా ఒక్కసారిగా పట్టాలపైకి దూకిన షెల్కే... చిన్నారిని ప్లాట్ ఫాంపైకి విసిరి తాను కూడా సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, రైల్వే శాఖ తమ ఉద్యోగిని అభినందించింది. ముంబయి రైల్వే అధికారులు ఆ సాహస వీరుడికి నగదు బహుమతి కూడా అందించారు.

ముంబయి నగరంలోని రైల్వే కార్యాలయానికి విచ్చేసిన మయూర్ షెల్కేకు తొలుత అదరిపోయే స్వాగతం లభించింది. అధికారులు, సిబ్బంది కరతాళ ధ్వనులతో అతడికి స్వాగతం పలికారు. అనంతరం రైల్వే డివిజనల్ మేనేజర్ షెల్కేకు రూ.50 వేల నగదు అందజేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News