Rajamouli: దసరాకి మహేశ్ సినిమాను లాంచ్ చేయనున్న రాజమౌళి?

Rajamouli Mahesh Babu Movie Launches at Dasara

  • రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు
  • శివాజీ జీవితచరిత్ర అంటూ ప్రచారం
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి    

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా 'దుర్గాష్టమి' రోజున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇటు ఎన్టీఆర్ అభిమానులు .. అటు చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. శివాజీ గెటప్ లో కృష్ణ తనకి తిరుగులేదనిపించుకున్నారు. దాదాపు అలాగే ఉండే మహేశ్ బాబు శివాజీ పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అయితే కథ అదేనా? కాదా? అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

కానీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ సినిమాకి అవసరమైన సెట్స్ స్కెచెస్ గీయించే బాధ్యతలను కూడా రాజమౌళి అప్పగించేయడం జరిగిందని చెబుతున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Rajamouli
RRR Movie
Mahesh Babu
  • Loading...

More Telugu News