Kasturba Gandhi Vidyalayam: ఆదోని కస్తూర్బా విద్యాలయంలో 53 మందికి కరోనా... అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని

Corona spreads in Adoni Kasturba Gandhi Vidyalayam
  • కస్తూర్బా విద్యాలయంలో కరోనా కలకలం
  • పాఠశాలలో 300 మంది విద్యార్థినులు
  • ఇటీవలే 23 మందికి పాజిటివ్
  • ఈసారి అంతకు రెండింతలు కరోనా కేసులు
  • విద్యాలయాన్ని మూసివేసిన అధికారులు
  • వైద్యాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఆళ్ల నాని
కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కలకలం రేగింది. ఈ గురుకుల విద్యాసంస్థలో 300 మంది విద్యార్థినులు ఉండగా, వారిలో 53 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. కస్తూర్బా విద్యాలయంలో కరోనాపై కర్నూలు జిల్లా ముఖ్య వైద్యాధికారికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. కస్తూర్బా విద్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇతర విద్యార్థినులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

కాగా, కొన్నిరోజుల కిందటే ఇదే కస్తూర్బా పాఠశాలలో 23 మందికి కరోనా అని నిర్ధారణ అయింది. తాజాగా అంతకు రెట్టింపు స్థాయిలో కేసులు రావడంతో విద్యాలయాన్ని మూసివేశారు.
Kasturba Gandhi Vidyalayam
Adoni
Corona Virus
Students

More Telugu News