Naresh: అప్పు తీర్చకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ స్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ యజమానిపై సీనియర్ నటుడు నరేశ్ ఫిర్యాదు

Senior actor Naresh complains against stone infra owner

  • లింగం శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులను ఆశ్రయించిన నరేశ్
  • తమ కుటుంబంతో శ్రీనివాస్ కు పరిచయం ఉందని వెల్లడి
  • ఆరేళ్ల కిందట అప్పు తీసుకున్నాడని వివరణ
  • సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని వెల్లడి

స్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్ అనే వ్యక్తిపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కు తమ కుటుంబంతో పరిచయం ఉందని, దాంతో అతడికి పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చామని నరేశ్ తెలిపారు. అతను తమకు రూ.10 కోట్లు చెల్లించాలని వెల్లడించారు. అయితే 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు శ్రీనివాస్ అప్పు చెల్లించకపోగా, తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. అందుకే సీసీఎస్ పోలీసులను ఆశ్రయించానని వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని  నరేశ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News