IPL: ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు

Two matches today in IPL

  • ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్
  • రెండు మ్యాచ్ లతో నేడు మస్త్ మజా
  • మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్
  • ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • రాత్రి 7.30 గంటలకు రెండో మ్యాచ్
  • ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్

ఓవైపు దేశంలో కరోనా మహమ్మారి చెలరేగుతున్న వేళ, సగటు క్రికెట్ అభిమానికి పసందైన వినోదం అందిస్తూ ఐపీఎల్ 14వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

గత సీజన్లలో చెత్త ఆటతీరుతో విమర్శలపాలైన బెంగళూరు జట్టు ఈసారి ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు ఇవాళ్టి మ్యాచ్ లోనూ అదే జోరు ప్రదర్శించాలని తహతహలాడుతోంది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ రెండు మ్యాచ్ లు ఆడి ఒక విజయం సాధించింది. బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది.

IPL
Match
RCB
KKR
Delhi Capitals
Punjab Kings
Chennai
Mumbai
  • Loading...

More Telugu News