Hyderabad: టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం

Hyderabad to be the venue for T20 world cup

  • ఈ ఏడాది అక్టోంబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్
  • పాక్ జట్టుకు వీసాలు ఇచ్చేందుకు భారత్ రెడీ
  • ఈసారి కొత్తగా హైదరాబాద్, చెన్నై, లక్నోలకు చోటు

ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేకపోయిన హైదరాబాద్ ఈ ఏడాది అక్టోబర్-నవంబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. దేశంలోని మొత్తం 9 వేదికల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించనుండగా అందులో హైదరాబాద్ ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఖ్యాతిగాంచిన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పైనల్ జరగనుంది.

2016 ప్రపంచకప్‌ను ఏడు వేదికల్లో నిర్వహించగా ఇప్పుడు వేదికల సంఖ్యను 9కి పెంచారు. ఈసారి హైదరాబాద్, చెన్నై, లక్నోలకు కొత్తగా అవకాశం లభించింది. అహ్మదాబాద్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ధర్మశాల, లక్నోలలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.  అయితే, ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాక్ జట్టుకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News