Chandrababu: రియల్ హీరో సోనూ సూద్ త్వరగా కోలుకోవాలన్న చంద్రబాబు

Chandrababu wishes Sonu Sood a speedy recovery
  • సోనూ సూద్ కు కరోనా పాజిటివ్
  • దేశవ్యాప్తంగా ప్రార్థనలు
  • స్పందించిన చంద్రబాబు
  • తాను కూడా ప్రార్థిస్తున్నట్టు వెల్లడి
  • సోనూ సూద్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ట్వీట్
ఆపన్నుల పాలిట రక్షకుడిగా కీర్తిప్రతిష్ఠలు పొందిన నటుడు సోనూ సూద్ కరోనా బారినపడడం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోనూ ఓ ప్రకటనలో వెల్లడించారు. దాంతో ఆయన ఆరోగ్యవంతుడవ్వాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా స్పందించారు.

మన రియల్ హీరో సోనూ సూద్ కరోనా నుంచి త్వరగా, పూర్తిగా కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్న ప్రజలతో తాను కూడా జత కలుస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. సోనూ సూద్ ఆరోగ్యవంతుడవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కాగా, చంద్రబాబు సందేశం పట్ల సోనూ సూద్ వినమ్రంగా స్పందించారు. 'థాంక్యూ సో మచ్ సర్' అంటూ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు.
Chandrababu
Sonu Sood
Corona Positive
Wish

More Telugu News