Kollywood: పెళ్లాడి మోసం చేశాడు... ఎస్ఐపై తమిళ వర్ధమాన నటి రాధ ఫిర్యాదు!

Tamil Actress Radha Complainted on SI

  • తమిళ చిత్ర సీమలో హీరోయిన్ గా పరిచయమైన రాధ
  • వసంత్ రాజ్ అనే ఎస్ఐతో వివాహేతర సంబంధం
  • ఆపై అతను మోసం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు

కోలీవుడ్ వర్ధమాన నటి రాధ, తనను ఓ ఎస్ఐ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ, విరుగంబాక్కం స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 'సుందరం ట్రావెల్స్' చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైన రాధ, తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత శాలిగ్రామ్ లో తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు తిరువాన్మియూరులో పని చేస్తున్న ఎస్ఐ వసంత్ రాజ్ తో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం అయింది.

అప్పటికే వసంత్ రాజ్ కు వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నా, రాధ కోసమే అత్యధిక సమయాన్ని కేటాయిస్తూ, ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయంలో వసంత్ రాజ్ భార్య గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసు సంగతి ఏమైందో కానీ, వసంత్ రాజ్ ఆపై రాధకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకుని వడపళని పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ సమయంలోనే రాధను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు.

ఆపై వసంత్ నే నమ్ముకున్న రాధ, అతన్ని సంప్రదించకుండా, తన ఆధార్ కార్డులో భర్త పేరు స్థానంలో వసంత్ రాజ్ పేరును చూపించింది. తన కుమారుడికి తండ్రిగానూ చూపించింది. దీంతో ఆమెకు దూరం కావాలని భావించిన వసంత్ రాజ్, ఎన్నూరుకు పోస్టింగ్ మార్చుకున్నాడు. ఆపై ఇద్దరి మధ్యా గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో వసంత్  ఆమెను బెదరింపులకు గురిచేశాడు. దీంతో రాధ విరుగం బాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Kollywood
Radha
Actress
Vasanth Raj
Police
  • Loading...

More Telugu News