Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుళ్ల దారుణ హత్య.. మావోయిస్టుల పనేనా?

Two police Constables killed in Chhattisgarh

  • కానిస్టేబుళ్లను అడ్డుకుని మారణాయుధాలతో దాడి
  • అక్కడికక్కడే కానిస్టేబుళ్ల మృతి
  • ఎవరు చేసి ఉంటారనేదానిపై పోలీసుల దర్యాప్తు

చత్తీస్‌గఢ్‌లో మరో దారుణం జరిగింది. ఇక్కడి సుక్మా జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. బెజ్జి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్ (29), ధనిరాం కశ్యప్ (31) బైక్‌పై సమీప గ్రామంలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు.

తిరిగి వస్తున్న సమయంలో వారి బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసింది మావోయిస్టులా? లేక, పాతకక్షల నేపథ్యంలో మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Chhattisgarh
Police
Killed
Moists
  • Loading...

More Telugu News