Tanikella Bharani: నా వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నా: వీడియో విడుదల చేసిన తనికెళ్ల భరణి

Tanikella Bharani Says Sorry in Twitter Post

  • ఇటీవల ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టిన తనికెళ్ల
  • అభ్యంతరాలు రావడంతో తొలగింపు
  • ఎవరిపైనా వ్యతిరేకత లేదని వెల్లడి

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ వేదికగా, తాను పెట్టిన ఓ పోస్ట్ కొంతమంది మనోభావాలను దెబ్బతీసినట్టుగా తెలిసిందని, అందుకు వివరణ ఇవ్వాలని భావించడం లేదని, చేతులు జోడించి, బేషరతుగా క్షమించాలని కోరుతున్నానని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా "నేను ఎవ్వరికీ వ్యతిరేకిని కాదు...!" అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

కాగా, ఇటీవలి కాలంలో 'శభాష్ రా శంకరా...' అంటూ సామాజిక మాధ్యమాల్లో తనికెళ్ల పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పెట్టిన ఓ పోస్టులోని వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన, దాన్ని తొలగించినట్టు తెలిపారు. తనకు హేతువాదులు, మానవతావాదులు అంటే, గౌరవం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని అన్నారు. ఒకరిని నొప్పించే అధికారం ఎవరికీ లేదని, జరిగిన పొరపాటుకు తనను మన్నించాలని కోరుతున్నానని తెలిపారు.

Tanikella Bharani
Facebook
Twitter
Sorry
  • Error fetching data: Network response was not ok

More Telugu News