YS Vijayamma: తెలంగాణ పోలీసులపై మండిపడిన వైఎస్ విజయమ్మ!

YS Vijayamma Fires on Telangana Police
  • నిన్న షర్మిల దీక్ష భగ్నం
  • పాదయాత్ర చేస్తుంటే తరలించిన పోలీసులు
  • మండిపడిన వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ లోని ఇందిరానగర్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్న వేళ జరిగిన పరిణామాలపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, పోలీసులు దౌర్జన్యం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కుమార్తె చేపట్టిన దీక్షను తెలంగాణ ప్రభుత్వం గౌరవించి ఉండాల్సిందన్నారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక, రాష్ట్రంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, శాంతియుతంగా నిరసన చేపడితే, దాష్టీకాలు ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే, జరగబోయే ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని అన్నారు.
YS Vijayamma
Sharmila
Telangana
Police

More Telugu News