Citi Group: భారత్‌లో రిటైల్‌ బ్యాంకింగ్‌ నుంచి సిటీ గ్రూప్‌ నిష్క్రమణ

Citi group to shut its retail banking business in India and china

  • మొత్తం 13 దేశాల నుంచి వైదొలగనున్న సంస్థ
  • కొనసాగనున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌
  • జేన్‌ ఫ్రేసర్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయం
  • గత త్రైమాసికంలో 7.94 మిలియన్‌ డాలర్ల లాభాలు

భారత్‌, చైనా సహా మొత్తం 13 దేశాల్లో రిటైల్‌ బ్యాంకింగ్ విభాగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు సిటీ గ్రూప్‌ ప్రకటించింది. ఇకపై ఆయా దేశాల్లో కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. రిటైల్‌ బ్యాంకింగ్‌ విషయానికి వస్తే సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌, యూఏఈ మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఈఓ జేన్‌ ఫ్రేసర్‌ తీసుకున్న తొలి కీలక నిర్ణయం ఇదే కావడం విశేషం. నాలుగో త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంగా సిటీ గ్రూప్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇక చివరి త్రైమాసికంలో ఈ సంస్థ 19.3 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని.. 7.94 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

  • Loading...

More Telugu News